ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu and his family at Hyderabad Airport

ఎయిర్ పోర్ట్ లో వారణాసి షర్ట్ తో మహేష్

Mahesh Babu and his family at Hyderabad Airport


సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ముగించుకుని భార్య నమ్రతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టారు. మహేష్ బర్త్ డే కి ఫ్యామిలీతో సింగపూర్ ట్రిప్ వేసిన పది రోజులుగా అక్కడే ఎంజాయ్ చేసారు. పుట్టిన రోజు వేడుకలు, ఫ్యామిలీ ట్రిప్ ముగించుకుని మహేష్ హైదరాబాద్ వచ్చేసారు.

అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు వారణాసి మూవీ షర్ట్ లో అంటే రుద్రా కేరెక్టర్ కి సంబందించిన షర్ట్ లో కనిపించారు. షర్ట్ బ్యాక్ సైడ్ త్రిశూలం, ఢమరుకం, ఎద్దు ఇలా ప్రింట్స్ ఉండగా.. ఫ్రెంట్ సైడ్ వారణాసి టైటిల్ లోగో కనిపించింది. మహేష్ బాబు వారణాసి చిత్రంలో రుద్రా కేరెక్టర్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ బర్త్ డే కి మహేష్ రుద్రా కేరెక్టర్ నుంచి రెండు స్టిల్స్ వదిలి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే దర్శకుడు రాజమౌళి వారణాసి కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. మహేష్ సింగపూర్ ట్రిప్ ముగించుకుని వారణాసి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు.

Mahesh Babu