కింగ్ నాగ్ కూడా సైబర్ బాధితుడే
Nagarjuna Akkineni shares cyber fraud experience
ఈమధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షలు కాదు కోట్లలో పోగొట్టుకుంటున్నారు. చదువు లేని వాళ్లే కాదు సెలెబ్రటీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, మాజీ అధికారులు అయినా ఈ సైబర్ బాధితులే. చిన్నోళ్లు లేదు, పెద్దోళ్ళు లేదు అందరూ సైబర్ వలలో పడినవాళ్ళే. సామాన్యుల కన్నా ఎక్కువగా చదువుకున్నవాళ్ళే ఈ లిస్ట్ లో ఉండడం గమనార్హం.
తాజాగా కింగ్ నాగార్జున తను తన ఫ్యామిలీ కూడా సైబర్ బాధితుడిని అని చెప్పడం చూస్తే సైబర్ నేరగాళ్లకు సామాన్యులు లేరు, సెలబ్రిటీస్ లేరు అందరూ సమానమే అనిపించక మానదు. ఫోన్ లో గేమ్స్ ఆడినా, లేదంటే యుపిఐ లో డబ్బులు పంపినా, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ను కొట్టెయ్యడం, ఫొటోస్ మార్ఫింగ్ అన్ని సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత,
కింగ్ నాగార్జున తాజాగా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం ఒక వ్యక్తి బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి మమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేసాడని, అంతేకాకుండా విదేశాలకు మాదక ద్రావ్యాలను పార్సెల్ చేసినట్లు కొందరు నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు, ఇక నా ఫ్యామిలిలో కొందరిని భయపెట్టి ఆరేడు గంటల పాటు డిజిటల్ అరెస్టు కూడా చేసినట్లుగా నాగ్ చెప్పుకొచ్చారు,
అందుకే తన ఫోన్ పాస్ వర్డ్ ని తాను వారానికొకసారి చేంజ్ చేస్తాను అని అలాగే వైఫై పాస్ వర్డ్ ని నెలకోసారి చేంజ్ చేస్తానని, అంతేకాదు ఫోన్ లోను ఎలాంటి ఫొటోస్ షేర్ చెయ్యను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.







































