ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas fans are waiting for a Fauzi update

ఫౌజీ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్

Prabhas fans are waiting for a Fauzi update


ఆగస్టు 15 వస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. త్వరలోనే షూటింగ్  కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లబోతుంది. మరో మూడు నెలల్లో ఫౌజీ విడుదల. డిసెంబర్ 3 న ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ విడుదల అంటూ మేకర్స్ రీసెంట్ గానే డేట్ అనౌన్స్ చేసారు.

అయితే సడెన్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీ నుంచి అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. కారణం ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15న ఫౌజీ యూనిట్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

మరో నాలుగు రోజుల్లో రాబోతున్న ఆగస్టు 15 న ఫౌజీ అప్ డేట్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా సీనియర్ నటి జయప్రద ప్రభాస్ కి మదర్ కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. 

Prabhas Fans Are Madly Waiting For Independence Day Treat