కూరలో కర్వేపాకులా తీసేసారు-అలీ
Ali said he never initially intended to enter politics situation
కమెడియన్ గా సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు అలీ రాజకీయాల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఒకప్పుడు టీడీపీ పార్టీ, ఆతర్వాత వైసీపీ పార్టీ రెండు పార్టీలో అలీ కి మాత్రం సముచిత స్థానం దక్కలేదు. ఎంపీ గానో, ఎమ్యెల్యే గానో టికెట్ ఆశించి భంగపడ్డారు. అదే విషయం అలీ తాజాగా ఓపెన్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
తనకు రాజకీయాలు కలిసి రాలేదు అంటూ.. అనుకొకుండా పార్టీ కండువా కప్పించుకుని 20 ఏళ్లు టీడీపీ లో ఉన్నాను, ఎలక్షన్స్ అప్పుడు వాడుకుని వదిలేసారు. గొడ్డులా కష్టపడినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఆ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేసాను. ఆ పార్టీలోనూ ఐదేళ్లు అదే జరిగింది.
వాడుకుని వదిలేసారు, రెండు పార్టీలు కూరలో కర్వేపాకులా తీసిపారేసారు.. రాజకీయాల్లో నాకు ఒరిగింది ఏమి లేదు. సినిమానే నాకు అన్నం పెట్టింది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి నా సినిమాలు నేను చేసుకుంటున్నాను అంటూ కమెడియన్ అలీ రాజకీయాల్లో తనెంతగా ఆవేదన చెందనో అనేది బయటపెట్టారు.







































