వారణాసి నుంచి సూపర్ స్టార్ కి సింపుల్ విషెస్
Happy Birthday to Super star Mahesh Babu
ఆగష్టు 9 సూపర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈరోజు. మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే కటౌట్స్ పెట్టి కేక్స్ కట్ చెయ్యడమే కాకుండా మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు రీ-రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దానితో పాటుగా మహేష్ ఫ్యాన్స్ ఆయన పాన్ ఇండియా ఫిలిం వారణాసి నుంచి భారీ ట్రీట్ ఆశించారు.
దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కి వారణాసి చిత్రం నుంచి ఫోటోగ్రాఫ్స్ వదిలారు. మహేష్ స్టైలిష్ లుక్ లో ఉన్న రెండు ఫొటోస్ వారణాసి నుంచి వదులుతూ.. Happy Birthday @urstrulymahesh 💙 To a journey beyond time……beyond worlds…. beyond imagination 🔥 అంటూ సింపుల్ గా విషెస్ చెప్పేసారు.
మహేష్ ఫ్యాన్స్ వారణాసి స్టిల్స్ చూసి హ్యాపీ నే. కానీ ఎక్కడో వారిలో చిన్న అసంతృప్తి. అది వారణాసిలో మహేష్ పాత్ర తాలూకు వీడియో ని వారు ఎక్స్పెక్ట్ చేసారు. కానీ రాజమౌళి జస్ట్ స్టిల్స్ రిలీజ్ చేసి మహేష్ కి చాలా సింపుల్ గా విషెస్ చెప్పడం వారిని కాస్త డిజప్పాయింట్ చేసింది.
ఏది ఏమైనా వారణాసి నుంచి వచ్చిన మహేష్ పాత్ర తాలూకు రుద్ర గెటప్ లో ఉన్న ఫొటోస్ మాత్రం మహేష్ అభిమానులకు తెగ నచ్చేసాయి.
















































