మళ్ళీ మారో మెగా స్ట్రోక్

Another mega stroke


మెగాస్టార్ చిరంజీవి కనుసన్నల్లో, ఆయన ఆజ్ఞల మేరకు జరిగిన థింగ్.. మెగా యూత్ ఫోర్స్ అని స్టార్ట్ చేసి ఫ్యాన్స్ అందరిని ఓ షెల్టర్ కిందకు తీసుకొచ్చి, సీనియర్ ఫ్యాన్స్ కి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చేయించి, ఇలా అన్ని ఆర్గనైజ్డ్ గా చేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేస్తుంటే దానికంటే ఒక స్టెప్ ముందుకు వెళ్లిపోయి అల్లు అర్జున్ AAFA మీటింగ్ పెట్టి, డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వారితో ఫోటోలు దిగారు.

అంతేకాదు ఫ్యాన్స్ తో పర్సనల్ గా మాట్లాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. కొంతమంది ఫ్యాన్స్ కి ఇన్సూరెన్స్ అందించారు. ఇక ఇప్పుడు చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ మిగతా మెగా హీరోలు కానీ ఫ్యాన్స్ మీట్ చెయ్యాలి అంటే అల్లు అర్జున్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ పని ఏ మెగా హీరో చెయ్యలేరు.

ఇక్కడ అల్లు అర్జున్ మళ్లీ మరో మైండ్ గేమ్ ఆడబోతున్నాడా? ఆగష్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఆ రోజు ఆయన విశ్వంభర రిలీజ్ డేట్ రాబోతుంది. బాబీ సినిమా పోస్టర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ అగైన్ కమింగ్ విత్ రాకా లేటెస్ట్ అప్ డేట్స్.

ఇది అనుకోకుండా జరుగుతుందా, లేదంటే అల్లు వారబ్బాయి అనుకునే చేస్తున్నాడా అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లోనే కాదు మిగతా కామన్ ఆడియన్స్ లోను మెదులుతున్న ప్రశ్న. 

Mega fans vs Allu fans