Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan To Undergo Wrist Surgery In Coimbatore

సర్జరీ కోసం ఫ్యామిలీతో కోయంబత్తూరు కు చరణ్

Ram Charan To Undergo Wrist Surgery In Coimbatore

పెద్ది చిత్ర షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్ కి ఆ ప్రమాదంలో చేతి మణికట్టు దగ్గర గాయమైంది. రామ్ చరణ్ పెద్ది ప్రమోషన్స్ లోను చేతికి కట్టుతోనే కనిపించారు. పెద్ది విడుదల తర్వాత రామ్ చరణ్ మణికట్టుకి సర్జరీ అవసరం అవుతుంది, ఆతర్వాత ఆయన రెండు నెలలు విశ్రాంతి తర్వాతే సుక్కు సినిమా సెట్ లో అడుగుపెడతారని అన్నారు.

తాజాగా రామ్ చరణ్ తన మణికట్టు సర్జరీ చేయించుకునేందుకు భార్య ఉపాసన తో కలిసి కోయంబత్తూర్ వెళ్లారు. కోయంబత్తూరు లోని గంగా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రేపు సోమవారం రామ్ చరణ్ కు మణికట్టు సర్జరీ నిర్వహించనుంది.

సర్జరీ జరిగేటప్పుడు చరణ్ కి తోడుగా ఆయన భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్, తల్లి సురేఖ లు ఉండేందుకు వారు కూడా రామ్ చరణ్ తో పాటుగా కోయంబత్తూరు వెళ్లారు. ఈ సర్జరీ తర్వాత రామ్ చరణ్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోనున్నారు అని తెలుస్తుంది.

Ram Charan heads to Coimbatore for surgery