చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్స్

Chennai Love Story Day 1 CollectionChennai Love Story Day 1 Collection


కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో SKN తెరకెక్కించిన చెన్నై లవ్ స్టోరీ నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి ఒకరోజు ముందు విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదల కావడంతో చెన్నై లవ్ స్టోరీ ఓపెనింగ్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే జన నాయగన్ ప్రభావం చెన్నై లవ్ స్టోరీపై ఏమి కనిపించలేదు.

కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ మొదటిరోజు రూ.12.3 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి మరీ మొదటిరోజు నెంబర్లను ప్రకటించారు. చెన్నై లవ్ స్టోరీ తో కిరణ్ అబ్బవరం మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు. సినిమాకి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో రెండోరోజు అంటే ఈరోజు చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

కిరణ్ అబ్బవరం యాక్టింగ్, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా నటన, ఫస్ట్ హాఫ్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకి ప్లస్ గా నిలవడంతో చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిది. అంతకుముందు హీరో, హీరోయిన్ ప్రమోషన్స్ అన్ని చెన్నై లవ్ స్టోరీ ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యాయి. 

Chennai Love Story openings