లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన నయనతార

Nayanthara buys a luxury villaNayanthara buys a luxury villa

 

లేడీ సూపర్ స్టార్ నయనతార 40 ప్లస్ ఏజ్ లోను క్రేజీ హీరోయిన్ గా తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాల్లో వెలుగొందుతుంది. యంగ్ హీరోస్, స్టార్ హీరోస్, పాన్ ఇండియా స్టార్స్ ఇలా నయనతార కి ఫుల్ డిమాండ్ ఉంది. జవాన్ తో హిందీలోకి అడుగుపెట్టిన నయనతార సల్మాన్ తో మరో మూవీ చేస్తుంది.

అయితే నయనతార తన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. తన భర్త విగ్నేష్, కొడుకుల కోసం టైమ్ స్పెండ్ చేస్తూనే కెరీర్ లో బిజీగా ఉంటుంది. అయితే నయనతార గతంలో చెన్నై లో ఓ ప్రాపర్టీ కొనగా.. అప్పట్లో అది హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి నయనతార పర్చేస్ చేసిన విల్లా వార్తల్లో నిలిచింది.

చెన్నైలోని చాలా కాస్ట్లీ ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌లో సుమారు రూ.40 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను నయనతార కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నయనతార కొన్న రూ.40 కోట్ల లగ్జరీ విల్లా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే నయనతార ఇలా కాస్ట్లీ ప్రాపర్టీస్ కొనడం వెనుక రియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటున్నారు.

అటు సినిమాలు నిర్మిస్తూనే ఇటు ఇలా కాస్ట్లీ ప్రాపర్టీస్ కొంటూ నయనతార రియల్ ఎస్టేట్ లోను పెట్టుబడులు పెడుతుందేమో అనే సందేహాలు ఆమె అభిమానులే వ్యక్తం చేస్తున్నారు.

Nayanthara Buys 45 Crore Villa In Chennai Poes Garden