NBK111 షూటింగ్ లో జారిపడ్డ బాలయ్య
Balakrishna injured on film shoot
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న #NBK111 చిత్ర షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. గత మూడు రోజులుగా కాకినాడ పోర్ట్ లో #NBK 111 షూటింగ్ జరుగుతుంది. ఈరోజు షూటింగ్ చేస్తున్న సమయంలో పోర్ట్ లో బాలయ్య కాలు జారి కింద పడిపోయారు.
దానితో ఆయన మోకాలికి చిన్న గాయమైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర బృందం బాలయ్యను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య అలాగే ప్రధాన పాత్రధారులపై గోపీచంద్ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రమాదంలో బాలయ్య కాలికి స్వల్ప గాయమే అయ్యింది అని, అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్, సంజయ్ దత్ లు నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
Balakrishna suffered a minor knee injury on the sets of NBK111







































