భగవంత్ కేసరి రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Director clarifies the Bhagavanth Kesari remake!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న `జన నాయగన్` సినిమాకు సంబంధించి కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ `భగవంత్ కేసరి`కి రీమేక్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ క్లారిటీ ఇచ్చారు.
`జన నాయగన్` పూర్తిగా ఒకే చిత్రానికి జిరాక్స్ కాపీ కాదని స్పష్టం చేశారు. ఈ చిత్రం సుమారుగా 50 శాతం మాత్రమే `భగవంత్ కేసరి` స్ఫూర్తితో రూపొందించబడిందని వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో మొదటి అర్ధభాగం సుమారు 60 శాతం మేర పోలికలు కలిగి ఉండగా.. రెండో అర్ధభాగం 20 శాతం మాత్రమే రీమేక్ ఛాయలను కలిగి ఉంటుందని తెలిపారు.
తనకు మొదట రీమేక్‌లు చేసే ఆసక్తి లేనప్పటికీ విజయ్ కోరిక మేరకు ప్రాజెక్ట్‌ను అంగీకరించినట్లు వినోద్ పేర్కొన్నారు. విజయ్ `భగవంత్ కేసరి` సినిమాను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారని మహిళా సాధికారతపై ఉన్న బలమైన సందేశం నచ్చి ఈ కథను చేయమని కోరడంతోనే సినిమా రూపుదిద్దుకుందని వివరించారు.
దీంతో నెట్టింట జరుగుతోన్న అన్ని రకాల ప్రచారలకు నేటితో పుల్ స్టాప్ పడింది. `జన నాయగన్ `మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.







































