అఖిల్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యిందా?

Akkineni AKhil


అక్కినేని ప్రిన్స్ అఖిల్ విజయం కోసం గత కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. అఖిల్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా సినిమాలు చేసాడు. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు బావున్నాయి. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు. చివరిగా ఏజెంట్ అఖిల్ ని మరీ డిజప్పాయింట్ చేసింది.

ఇక ఇప్పుడు మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో లెనిన్ అంటూ రూరల్ డ్రామా చేసాడు. అందమైన అఖిల్ కాస్త డీ గ్లామర్ గా కనిపించినా ఈ చిత్రం జులై 10 న విడుదలైంది. లెనిన్ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. సినిమా విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ కనిపించింది. క్రిటిక్స్, ఆడియన్స్ అందరూ లెనిన్  బావుంది అన్నారు.

అలా అని బ్లాక్ బస్టర్ రివ్యూస్ లెనిన్ కి రాలేదు. అలాగే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ కనిపించలేదు. ఎబోవ్ యావరేజ్ ఫిలిం లెనిన్ అన్నారు. దాంతో అఖిల్ ఎమోషనల్ అవుతూ తండ్రి నాగ్ ని హగ్ చేసుకుని తన సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భార్య తో కలిసి సందడి చేసాడు.

మరి లెనిన్ తో అఖిల్ డ్రీం ఫుల్ ఫిల్ అయ్యిందా? అఖిల్ అనుకున్న సక్సెస్ లెనిన్ అందించిందా? అంటే ఈ హిట్టు అఖిల్ ని కచ్చితంగా నిలబెడుతుంది అనేది మాత్రం చెప్పగలం.
 

Hero Akkineni AKhil