మతిపోగొడుతున్న భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్

Bhagyashri Borse's stunning  lookBhagyashri Borse's stunning look

 

ఎట్టకేలకు లెనిన్ చిత్రంతో గాడి లో పడిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే .. ఇకపై అవకాశాలు ప్రవాహంలో మునిగిపోయేలా కనిపిస్తుంది. హ్యాట్రిక్ ప్లాప్ లతో ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్నభాగ్యశ్రీ బోర్సే ఫైనల్ గా లెనిన్ చిత్రంతో హిట్ కొట్టేసరికి మురిసిపోతుంది. సినిమాలో భారతి లాంటి పల్లెటూరి పాత్రలోనే అందాలు చూపించిన భాగ్యశ్రీ బోర్సే లెనిన్ ప్రమోషన్స్ లోను అద్దరగొట్టేసింది.

చీర కట్టినా, చుడిదార్ వేసినా, లంగావోణీ అయినా భాగ్యశ్రీ బోర్సే లుక్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. తాజాగా భాగ్యశ్రీ బోర్సే షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. చేతిలో కలువ పువ్వుతో మత్తెక్కించే చూపులతో, లూజ్ హెయిర్ లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్ దేవకన్యను తలపించాయంటే నమ్మాల్సిందే.

డార్క్ బ్లూ కాస్ట్యూమ్ లో సింపుల్ జ్యువలరీతో భాగ్యశ్రీ బోర్సే మతిపోగోట్టే లుక్ లో దర్శనమిచ్చింది. చక్కని ఫిట్ నెస్, గ్లామర్ లుక్స్ భాగ్యశ్రీ బోర్సే సొంతం. మీరు కూడా భాగ్యశ్రీ బోర్సేకొత్త ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

 

Bhagyashri Borse