ఫౌజీ బడ్జెట్ రివీల్
Fauzi Budget Revealed
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఫౌజీ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కుతుంది. ప్రభాస్ స్పిరిట్ ఇంకా ఫౌజీ ఇలా రెండు సినిమా షూటింగ్స్ చేస్తూ ఇప్పుడొక స్మాల్ బ్రేక్ తీసుకుని యూరప్ ట్రిప్ కి వెళుతున్నారు.
తాజాగా ఫౌజీ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ మరియు విజువల్స్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారి భారీ అంటే దాదాపు రూ.500 నుండి రూ.600 కోట్ల తో నిర్మిస్తోంది అని సమాచారం. ఇది ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అని సమాచారం.
భారీ సెట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా, హను రాఘవపూడి మార్క్ ఎమోషన్, అద్భుతమైన ప్రేమకథ కూడా హైలెట్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఫౌజీ చిత్రాన్ని డిసెంబర్ 3 న విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా, త్వరలోనే ఈ డేట్ పై అఫీషియల్ ప్రకటన ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది.







































