పెళ్ళైన వేళా విశేషం - బాగా కలిసొచ్చింది

Akkineni Akhil

 

అఖిల్ అక్కినేని గత ఏడాది ఒక ఇంటి వాడయ్యాడు. దుబాయ్ కి చెందిన బిజినెస్ ఫ్యామిలీ అమ్మాయి జైనాబ్ ని ప్రేమించాడు, పెద్దల అంగీకారంతో అఖిల్ తన ఇంట్లోనే గ్రాండ్ గా జైనాబ్ ని వివాహం చేసుకున్నాడు. అఖిల్ జైనాబ్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగార్జున అఖిల్ రిసెప్షన్ కి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరిని పిలిచి గ్రాండ్ గా విందు కూడా ఇచ్చారు.

అఖిల్ లెనిన్ సినిమా షూటింగ్ సమాయంలోనే జైనాబ్ తో ఏడడుగులు వేసాడు. మరి పెళ్లైన వేళా విశేషం అఖిల్ కి బాగా కలిసొచ్చింది. అదే విషయం కింగ్ నాగార్జున లెనిన్ చిత్ర ప్రమోషన్స్ లో పెళ్లి చేసుకున్నాడు, కలిసొచ్చింది అంటూ మట్లాడడం చూసిన వాళ్ళు అది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజమే అఖిల్ కి పెళ్ళైన వేళా విశేషం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హిట్ దొరికేసింది. లెనిన్ తో అఖిల్ హిట్ కొట్టేసాడు. నాగార్జున చెప్పడం కాదు మనవడు కొట్టేసాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి ఎప్పటి నుంచో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ కి పెళ్లయ్యాక దొరకడం చూస్తే వాళ్ళు అంటున్నది నిజమే అని నమ్మాల్సిందే కదా.!