ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nidhi Agarwal Interesting Comments on Marriage

పెళ్లి తర్వాత తిరుపతికి వస్తానంటున్న హీరోయిన్

Nidhi Agarwal Interesting Comments on Marriage


హీరోయిన్ జాన్వీ కపూర్ తన పెళ్లి తిరుపతిలో జరగాలని, పెళ్లి తర్వాత భర్త తో కలిసి తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని ఉంది అంటూ పలుమార్లు చెప్పింది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి వస్తాను అంటూ తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ఆమె ఎవరో కాదు హాట్ భామ నిధి అగర్వాల్. నిన్న బుధవారం నిధి అగర్వాల్ తిరుమల తిరుపతి వెళ్లి ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది. ఆతర్వాత మీడియాతో మట్లాడుతూ.. నా పెళ్లి తర్వాత మళ్లీ తిరుమలకు వస్తాను. ప్రస్తుతం అయితే పెళ్లి గురించి పెద్దగా ప్లాన్స్ ఏమి లేవు.

ఇంకా పెళ్లి కొడుకు దొరకలేదు, ప్రస్తుతం సినిమాల్తో బిజీగా వున్నాను. హిందీలో రెండు ప్రాజెక్ట్స్, తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. మరి నిధి అగర్వాల్ కి ఆ పెళ్లి ఘడియలు ఎప్పుడు వస్తాయో జస్ట్ వెయిట్ అండ్ సి. 

Actress Nidhi Agarwal Visited Tirumala Temple