Advertisement

జన నాయకుడికి మోక్షం కలిగినట్లే

Jana Nayagan eyes late July release

 

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం జన నాయగన్ కు మోక్షం కలిగేలా కనిపిస్తుంది  సమస్యలతో గత ఆరు నెలలుగా వాయిదాలో ఉన్న జన నాయగన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని విజయ్ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. జన నాయగన్ కి ప్రస్తుతం సెన్సార్ సమస్యలు తీరిపోయాయి.

సెన్సార్ బోర్డు విజయ్ జన నాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చెయ్యడంతో జన నాయగన్ విడుదలకు చిక్కులు తొలిగిపోయినట్లే కనిపిస్తుంది. ఇక విడుదలే ఆలస్యం. జన నాయగన్ మేకర్స్ కూడా సినిమా విడుదల విషయంలో రెండు డేట్స్ పై కన్నేసినట్లుగా తెలుస్తుంది.

అందులో ఒకటి జులై 24 లేదంటే జులై 30 న కానీ జన నాయగన్ విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జన నాయగన్ ఈరోజో రేపో ఈ తేదీపై క్లారిటీ వస్తుంది అని, అధికారికంగా త్వరలోనే జన నాయగన్ రిలీజ్ డేట్ పై ప్రకటన వస్తుంది అని సమాచారం. 

Jana Nayagan Eyes July 24 Release