హోప్స్ వదులుకున్న మెగా ఫ్యాన్స్

Mega fans have given up hopeMega fans have given up hope


పాపం మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ విశ్వంభర పై హోప్స్ వదిలేసుకున్నారు. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విషయం వదిలేసి రీసెంట్ గా విడుదలైన సింగ్ గీతం సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది చూసిన మెగా ఫ్యాన్స్ వేరే సినిమాని పొగిడితే పొగిడావ్ కానీ, మా విశ్వంభర విషయం తేల్చమని వసిష్ఠ ను తగులుకున్నారు.

విశ్వంభర సీజీ వర్క్ అంటూ ఏడాదిన్నరగా వసిష్ఠ దానిపైనే కూర్చున్నారు కానీ.. సినిమా అప్ డేట్స్, రిలీజ్ డేట్ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ సహనానికి పరిక్ష పెడుతున్నారు. చిరు విశ్వంభర చిత్రంపై ఆశలు రేపి ఇప్పుడు ఆ సినిమాపై అసలు హోప్స్ లేకుండా చేసారంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

విఎఫెక్స్ వర్క్ కి సమయం పడుతుంది, కానీ ఏడాదిన్నర కాలమైతే పట్టదుగా.. కనీసం రిలీజ్ డేట్ ఇచ్చి, ప్రమోషన్స్ గా ఏదో ఒక క్రేజీ అప్ డేట్ వదిల్తే సినిమాని మర్చిపోరు. లేదంటే ప్రేక్షకుల మైండ్ నుంచి విశ్వంభర వెళ్లిపోతుంది అదే మెగా అభిమానుల ఆందోళన. 
 

Vishwambhara - Dussehra or Sankranti