యశ్ టాక్సిక్ సంక్రాంతికా?

Toxic Eyeing Pongal ReleaseToxic Eyeing Pongal Release


కన్నడ స్టార్ హీరో యశ్ కెజిఎఫ్ తర్వాత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న పాన్ ఇండియా ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వద్దామని టాక్సిక్ ద మూవీ గా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్లాన్ చెయ్యగా.. ఎప్పుడో మార్చి 19 న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 4 కి పోస్ట్ పోన్ అయ్యింది.

అప్పుడు ధురంధర్ 2 నుంచి తప్పించుకున్న టాక్సిక్ జూన్ 4 న ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే.. జూన్ 4 నుంచి కూడా టాక్సిక్ విడుదల వాయిదా వేశారు మేకర్స్. ఈలోపులో టాక్సిక్ రీ షూట్ చేస్తున్నారు, ఓటీటీ డీల్ అవ్వలేదు, అందుకే టాక్సిక్ కొత్త డేట్ ఇవ్వడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక యశ్ టాక్సిక్ దసరా కి ఏమైనా విడుదల ఉంటుంది అనుకుంటే.. తీరా ఇప్పుడు 2027 సంక్రాంతికి టాక్సిక్ రిలీజ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి అదే నిజమైతే యశ్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవ్వాల్సిందే. చూద్దాం యశ్ అండ్ మేకర్స్ టాక్సిక్ ద మూవీ రిలీజ్ ఎప్పుడు అంటారో అనేది. 

Yash Toxic Might Release For Sankranthi 2027