కల్కి 2 లోకి ఎంటర్ అవుతున్న అలియా భట్
Bollywood Beauty enters Kalki 2898 AD sequel
కల్కి 2 లో దీపికా పదుకొనె ని తప్పించి తర్వాత ఆమె స్థానంలోకి చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. నాగ్ అశ్విన్ దీపికా పదుకొనె స్థానంలో ఎవరిని తీసుకొస్తారా అనే క్యూరియాసిటీకి తెర దించుతూ సాయి పల్లవి సుమతి పాత్ర కోసం ఎంటర్ అవుతుంది అన్నారు, కానీ అఫీషియల్ ప్రకటన లేదు.
అయితే ఇప్పుడు తాజాగా కల్కి 2 లోకి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఎంటర్ కాబోతుంది అని తెలుస్తుంది. అయితే అలియా భట్ దీపికా పదుకొనె రీప్లేస్ చెయ్యడం లేదు, ఆమె కల్కి 2 లోకి స్పెషల్ రోల్ కోసం రాబోతుంది అని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ తాజాగా సుమతి పాత్ర పై అలాగే కల్కి 2 షూటింగ్ విషయమై రియాక్ట్ అయ్యారు.
కల్కి 2 ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఆగష్టు లేదా, సెప్టెంబర్ నుంచి లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాము, ఆ షెడ్యూల్స్ పూర్తయ్యాకే కల్కి 2 రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు.







































