సీరియల్ నటి సంచిత ఆత్మహత్య
Sanchita Ugale Suicide
ఏ భాషలో నటించే నటులైనా, నటీమణులైనా.. ఒక్కోసారి డిప్రెషన్ తోనో లేదంటే ఫ్యామిలీ ప్రోబ్లెంస్ వలనో, లేదు అంటే ఇండస్ట్రీ వేధింపుల కారణంతో తనువును అర్ధాంతరంగా చాలిస్తూ ఉంటారు. ఇలా బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైనా కనిపించే సంఘటనే ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి ఎదురైంది.
హిందీలో పాపులర్ అయిన కుంకుమ భాగ్య సీరియల్ ఆర్టిస్ట్ సంచిత ఉగాలే ఆత్మహత్య ముంబై లో కలకలం సృష్టించింది. కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సంచిత ఉగాలే, తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు గా తెలుస్తుంది.
విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సంచిత మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. కుంకుమ భాగ్య, వాగ్లేకి దునియా, దిల్‌వాలీ దుల్హా లే జాయేగి షోస్ తో పేరు తెచ్చుకున్న సంచిత తన కుటుంబంతో కలిసి ముంబై పరిసర ప్రాంతం నలసోపరాలో నివసిస్తుంది.
నిన్న ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న సంచిత బలవన్మరణానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.







































