ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Deverakonda, Rashmika Mandanna visit hometown

VD-రష్మిక అభిమానుల మనసు దోచేశారు

Vijay Deverakonda, Rashmika Mandanna visit hometown


ఫిబ్రవరిలో గోవా లో ప్రేమ వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు పెళ్ళి తర్వాత అభిమానులకు విందు, అతిధులకు విందు, జర్నలిస్ట్ లకు విందు తో అందరి మనసులను దోచేశారు. ఇప్పుడు మరోసారి భార్యాభర్తలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అభిమానులకు ఇచ్చిన మాటను, తండ్రి జన్మించిన ఊరు కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ తండ్రి జన్మించిన తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

మా నాన్న పుట్టిన చిన్న పల్లె తుమ్మనపేటకు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక మా ఒక చిన్న కలను ప్రకటించాం. అచ్చంపేట మండలంలోని 9, 10 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసారు. ఈరోజు ఆదివారం ఆ ఊరికి వెళ్లి తాము మాటిచ్చినట్లుగా ఆ కార్యక్రమంలో పాల్గొని గవర్నమెంట్ స్కూల్ పేద విద్యార్థులకు అండగా నిలిచి స్కాలర్ షిప్స్ అందించారు.

Vijay Deverakonda and Rashmika Mandanna have honored hardworking 9th and 10th-grade students