లెనిన్ గాడి పరుగు మొదలైంది
20 Days To go for Lenin
నిన్నటివరకు పెద్ది హడవిడి లో లెనిన్ అప్ డేట్స్ ఇవ్వకుండా వెయిట్ చేయించిన లెనిన్ మేకర్స్ ఇప్పుడు పరుగులు స్టార్ట్ చేసారు. పెద్ది విడుదలైన తెల్లారే సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఇంకా పెద్ది గాడి పరుగులు 20 రోజులే అంటూ అక్కినేని ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసారు.
లెనిన్ 20 డేస్ టు గో అంటూ పోస్టర్ రిలీజ్ చెయ్యడంతో అక్కినేని ఫ్యాన్స్ దానిని వైరల్ చేస్తూ ట్విట్టర్ X పేజీ ని ఆడేసుకుంటున్నారు. లెనిన్ చిత్రంతో అయ్యగారు అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతెలా కోరుకుంటున్నారో అనేది ట్విట్టర్ X పేజీ చూస్తే తెలుస్తుంది.
మురళి కిషోర్ అబ్భురి దర్శకత్వంలో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. లెనిన్ టీజర్, అఖిల్-భాగ్యశ్రీ బోర్సే ల కెమిస్ట్రీ అన్ని లెనిన్ పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఏజెంట్ తో బాగా డిజప్పాయింట్ చేసిన అఖిల్ లెనిన్ తో అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాల్సిందే.







































