ప్రభాస్ ని లాక్ చేస్తున్నారుగా
Kalki 2 will move at a rapid pace: Nag Ashwin
ప్రస్తుతం ప్రభాస్ విపరీతమైన ఎండల్లో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. అందులో సందీప్ వంగ స్పిరిట్ ఒకటి, మరొకటి హను రాఘవపూడి ఫౌజీ. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ లో ప్రభాస్ అలుపెరగకుండా పాల్గొంటున్నారు. స్పిరిట్, ఫౌజీ షూటింగ్స్ మాత్రమే కాదు త్వరలోనే ప్రభాస్ కల్కి 2 సెట్ లోకి వెళ్లాల్సి ఉంది.
కాదు కాదు కల్కి 2 దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ని లాక్ చేసేస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 షూటింగ్ మొదలైంది, అమితాబ్, కమల్ హాసన్ కాంబో సీన్స్ తెరకెక్కించాము, జులై నుంచి నిరంతరాయంగా కల్కి 2 షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది అంటూ నాగ్ అశ్విన్ ఓ ఈవెంట్ లో చెప్పడం చూసి ప్రభాస్ ని గట్టిగానే లాక్ చేస్తున్నారుగా అంటున్నారు.
నిజమే ఫౌజీ ని దసరాకి అన్నారు కానీ అది ఏడాది చివరిలో ఉండొచ్చు, ఆతర్వాత స్పిరిట్ మార్చ్ 2027 లో ఉంటుంది. సో కల్కి 2 కూడా 2027 లోనే విడుదల ఉండొచ్చు. అందుకే ప్రభాస్ ఆలస్యం చెయ్యకుండా ఈమూడు చిత్రాల షూటింగ్స్ లోను కష్టపడాల్సిందే. లేదంటే డెడ్ లైన్స్ మారిపోతాయి. ఈసారి దర్శకులు అలా జరగనిచ్చేలా లేరులే.







































