పెద్ది టికెట్ రూ.600 - నోలాన్ టికెట్ రూ.90,000
Peddi ticket Rs.600 - Nolan ticket Rs.90,000రామ్ చరణ్ `పెద్ది` టికెట్ ధర ప్రీషోల కోసం ఫ్యాన్స్ 600 పెట్టి టికెట్ కొనుక్కున్నారు. అయితే ఇంకా రిలీజ్ కి రాని క్రిస్టోఫర్ నోలాన్ సినిమా `ది ఒడిస్సీ` ఒక టికెట్ ధర ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. ఒక్కో టికెట్ ని ఈబేలో కొనాలంటే రూ.40,000 నుంచి రూ.90,000 చెల్లించుకోవాలి. అంటే 500 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ ఖర్చవుతుందన్నమాట.
ఇప్పటికే షో నిర్వాహకులు అడ్వాన్స్ గా టికెట్లు అమ్మారు. వాటిని ఈ-బే వంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో ఐమ్యాక్స్ 70 ఎంఎం టికెట్లను ఏకంగా ఇంత పెద్ద మొత్తాలకు రీసేల్ చేస్తున్నారు. నిజానికి 30 డాలర్ల లోపు ఉండే టికెట్ ని బల్క్ గా బుక్ చేసుకుని ఇప్పుడు ఈబేలో 90వేల (వెయ్యి డాలర్లు) ధరకు అమ్ముతుండడం నిజంగా ఔరా! అనిపిస్తోంది.
క్రిస్టోఫర్ నోలాన్ మొదటిసారి తన రెగ్యులర్ బాణీకి దూరంగా ఒక హిస్టారికల్ స్టోరీని ఎంపిక చేసుకుని `ది ఒడిస్సీ` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు రానుంది. ఇండియా రిలీజ్ గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ఒక టికెట్ ని 90 వేలు పెట్టి కొనడానికి వెనకాడటం లేదంటే నోలాన్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. `పెద్ది` హీరోతో సినిమా తీయడానికి భారతదేశంలో ఇలాంటి మరో దర్శకుడు పుడతాడంటారా?







































