ఈ హిట్ ఎన్టీఆర్ దగ్గరకి తీసుకెళుతుందా?

Peddi Public TalkPeddi Public Talk


ఉప్పెన బ్లాక్ బస్టర్ అయ్యాక ఎన్టీఆర్ తో దర్శకుడు బుచ్చి బాబు సినిమాని ఎనౌన్స్ చెయ్యడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండో సినిమాకే బుచ్చిబాబు ని ఎన్టీఆర్ దగ్గరకు చేర్చింది అని కుళ్ళుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఎందుకో బుచ్చి ప్రాజెక్ట్ పక్కనపెట్టి వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళిపోయాక కూడా బుచ్చి బాబు ని అదృష్టం వదల్లేదు.

సుకుమార్ రికమండేషన్ తో రామ్ చరణ్ తో తన రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు. పెద్ది తో ప్రెజెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చేసారు . పెద్ది స్టోరీ ని ఎన్టీఆర్ కోసం రాసుకుని రామ్ చరణ్ తో సినిమా చేసాడనే ప్రచారాన్ని కొట్టిపారేశాడు బుచ్చి బాబు. కానీ అదే నిజమంటున్నారు.

నిన్న రాత్రి ప్రీమియర్స్ తర్వాత పెద్ది కి వస్తున్న ఫీడ్ బ్యాక్ బుచ్చి బాబు ని ఎన్టీఆర్ దగ్గరకు చేర్చేలాగే కనిపిస్తుంది. చరణ్ తో చేసిన పెద్ది హిట్ అంటూ టాక్ వినిపిస్తుంది గనక బుచ్చి బాబు ఖచ్చితంగా మూడో ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే చేస్తాడు. ఇది ఫిక్స్. ఎన్టీఆర్ కూడా పిలిచి బుచ్చి కి ఛాన్స్ ఇవ్వడమైతే గ్యారెంటీ అంటున్నారు. 
 

Peddi Social Media Talk