ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan set to marry third time soon

మూడో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరో

Aamir Khan set to marry third time soon


బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్ళికి సిద్ధమయ్యారు. ఆమిర్ ఖాన్ తన ఫ్రెండ్ గా చెబుతున్న గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆమిర్ ఖాన్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకోగా, వారికి జునైద్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆతర్వాత రీనా తో విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్ 2005లో కిరణ్ రావును ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అమీర్, కిరణ్ రావు కరోనా సమయం అంటే 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆతర్వాత ఆమిర్ ఖాన్ గౌరికి దగ్గరయ్యారు.

ఆమిర్ బర్త్ డే రోజున గౌరిని అందరికి పరిచయం చేస్తూ.. తానూ గౌరీ దాదాపు 25 ఏళ్లుగా స్నేహితులమని, కొన్నాళ్ల క్రితమే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమిర్ ఆ సమయంలో వెల్లడించారు. ఇప్పుడు జులై 5 న వీరిరువురు పెళ్లి పీటలెక్కనున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Aamir Khan to marry Gauri Spratt in July