ఇకపై పెద్ది కి నో టెన్షన్

Peddi Ticket Hike Approved

 

ఈరోజు సాయంత్రం నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ చెయ్యడానికి రెడీ అయిన పెద్ది నిర్మాతలకు ఇకపై నో టెన్షన్. నిన్నటివరకు తెలంగాణాలో టికెట్ రేటు పెంపుకు, స్పెషల్ ప్రీమియర్స్ కి అనుమతులు రాక పెద్ది నిర్మాతల్లో ఆందోళన కనిపించింది. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు ప్రీమియర్స్ కి అనుమతులు రావడం, టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగినా తెలంగాణాలో కాస్త గందరగోళం నడిచింది.

కానీ ఇప్పుడు పెద్ది కి తెలంగాణ లో లైన్ క్లియర్ అయ్యింది. జూన్ 3 ప్రీమియర్ షో రాత్రి 8:00 గంటలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం దానికి టికెట్ ధర: ₹600 (GSTతో కలిపి) నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ టికెట్ ధరపై అదనంగా ₹100 పెంచుకోవచ్చు. పెంచిన టికెట్ ధరలు తెలంగాణలోని అన్ని థియేటర్లకు వర్తిస్తాయి.

ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు లో సాధారణ టికెట్ ధరపై అదనంగా ₹125 పెంచుకోవచ్చు. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 అదనపు పెంపు. అలాగే రోజుకు 5 షోలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

GO Issued For Hikes And Premiers For Peddi In Telangana