రుక్మిణి వసంత్ రాయల్ లుక్
Rukmini Vasant's royal look
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ లో పవర్ ఫుల్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈమధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా ఏఐ ఫొటోస్ తో ఇబ్బందిపడిన రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ చాలా నీట్ గా ఉంటాయి.
తాజాగా ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ లో రుక్మిణి వసంత్ రాయల్ గా చాలా స్టైలిష్ గా కనిపించింది. గ్లామర్ చూపించినా ఎబ్బెట్టుగా అనిపించని బ్యూటిఫుల్ లుక్స్ రుక్మిణి వసంత్ సొంతం. ఇప్పుడు నిజంగా రాయల్ లుక్ లో అద్దరగొట్టేసింది. ఎన్టీఆర్ డ్రాగన్ లోను రుక్మిణి వసంత్ ఇన్నోసెంట్ లుక్ లో బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంటుంది.
రుక్మిణి వసంత్ కాంతారా 2 తో పాన్ ఇండియా మార్కెట్ లో సందడి చేసింది. ఇక యశ్ టాక్సిక్ విడుదల కోసం పాప వెయిటింగ్.
Rukmini Vasant's latest look viral







































