పుష్ప 3 పై జగ్గూభాయ్ కీ కామెంట్స్
Jagapathi Babu key comments on Pushpa 3
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ని నేషనల్ స్టార్ ని చేసిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో అందరికి తెలుసు. పుష్ప సీరీస్ లో పుష్ప 3 ని అనౌన్స్ చేసినప్పటికీ.. హీరో అల్లు అర్జున్ దాన్ని బ్రేక్ చేసి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా మూవీ సెట్ లోకి వెళ్లిపోయారు. ఆతర్వాత లోకేష్ కనగరాజ్ తో మరో మూవీ. ఇవి పూర్తయ్యేసరికి ఓ ఐదేళ్లు పడుతుంది.
సుకుమార్ కి పుష్ప 3 విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి అల్లు అర్జున్ ప్రస్తుతం దానిని పక్కనపెట్టారు. దానితో పుష్ప 3 ఉండకపోవచ్చనే ఊహాగానాలకు జగ్గు భాయ్ అదేనండి సీనియర్ యాక్టర్ జగపతి బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన పెద్ది ప్రమోషన్స్ లో సుకుమార్ పుష్ప పార్ట్ 2 లో తన పాత్రను బాగా తగ్గించేయడం గురించి చెప్పడమే కాదు..
ఆ విషయంలో సుకుమార్ తనకు సర్దిచెప్పే క్రమంలో, పార్ట్-3లో తన పాత్రకు మంచి ప్రయారిటీ ఉంటుందని హామీ ఇచ్చినట్లు జగపతి బాబు పెద్ది ప్రమోషన్స్ లో రివీల్ చేసారు. మరి సుకుమార్, అల్లు అర్జున్ లు ఎప్పుడు కలిసి పుష్ప 3 చేస్తారో, అప్పుడు జగపతి బాబు కి ఎక్కువ డేట్స్ అవసరపడతాయన్నమాట.







































