విజయ్ గెలుపు - పవన్ పై ట్రోలింగ్

తమిళనాట హీరో విజయ్ గెలుపు దాదాపు ఖాయమైంది. ఈరోజు ఉదయం నుంచే విజయ్ టీవీకే పార్టీ 100 అసెంబ్లీ స్థానాల్లో భారీ మెజారిటీతో లీడింగ్ లో కనిపించడం.. సాయంత్రానికి 109 స్థానాల్లో లీడింగ్ లో కనిపించడంతో హీరో విజయ్ గెలుపు దాదాపుగా ఖాయమవడంతో ఆయన మిత్రులు, సినిమా ప్రముఖులు విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
మరోపక్క విజయ్ విజయం సాధించడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ క్రేజీ స్టార్ - పవన్ ప్యాకేజి స్టార్. విజయ్ సోలో గా విజయం సాధిస్తే పవన్ పొత్తులో విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ పదేళ్లు కష్టపడితే డిప్యూటీ అయ్యారు, విజయ్ సింగిల్ ఎటం లో సీఎం అవుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ట్రోల్ చేస్తుంది.
పార్టీ పెట్టిన కొద్ధి నెలల్లోనే విజయ్ తమిళనాట ప్రభంజనం సృష్టించారు, పవన్ కళ్యాణ్ కు అంతకుమించిన ఫాలోయింగ్ ఉంది కానీ పదేళ్ల పాటు పాలిటికల్ గా ఫెయిల్యూర్. ఇప్పుడు కూడా దత్తపుత్రుడిగా పొత్తు పెట్టుకుని విజయ్ సాధించారు తప్ప సోలో గా గెలవలేని పవన్ కళ్యాణ్ అంటూ ఇష్టం వచ్ఛినట్టుగా కామెంట్లు పెడుతూ విజయ్-జగన్ కలిసిన వీడియోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

Tamil nadu 2026 assembly election results, Vijay TVK winsVijay's victory - trolling Pawan