జ్యోతికతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూర్య
Suriya and Jyothika are enjoying their vacationకోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొద్దిరోజులుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలు వరసగా డిజప్పాయింట్ చేసున్నాయి. కంగువ, రెట్రో ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోలేక ఇబ్బంది పెట్టేశాయి. ప్రస్తుతం సూర్య అటు తెలుగు, ఇటు తమిళ్ లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
దాని కోసమే చెన్నై,హైదరాబాద్ అంటూ తిరగడమే కాదు మధ్యలో ఫ్యామిలీ కోసం ఆయన అప్ప్డుడప్పుడు ముంబై వెళుతున్నారు. ఇక తాజాగా షూటింగ్స్ నుంచి సూర్య కు అటు భార్య జ్యోతికకు కాస్త సమయం చిక్కడంతో ఇద్దరూ వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. వీరిద్దరూ ప్రస్తుతం సీచెల్ల్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
సూర్య-జ్యోతిక ఇద్దరూ తమకు ఇష్టమైన ఫుడ్ తింటూ, బీచ్ లో జాలిగా ఎంజాయ్ చేస్తూ ఉన్న సీచెల్ల్ వెకేషన్ వీడియోని ప్రత్యేకంగా షేర్ చేశారు. ఇలాంటి స్వర్గంలో ఇంకో రోజు నువ్వూ నేనూ అంటూ సూర్యతో ఉన్న క్షణాల్ని ఆ వీడియో తో జ్యోతిక పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
Suriya and Jyothika are enjoying their vacation in Seychelles






































