ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dil Raju second marriage secret revealed

దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ సీక్రెట్ రివీల్

దిల్ రాజు తన మొదటి భార్య అనిత హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణించంతో తర్వాత కొద్దిరోజుల గ్యాప్ తో మరో అమ్మాయి(ఎయిర్ హోస్టెస్) తేజస్విని ని రెండో వివాహం చేసుకున్నారు. 2020 కరోనా సమయంలో దిల్ రాజు కట్టించిన వేంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు తేజస్వినిని సింపుల్ గా వివాహమాడారు. వారికి ఓ బాబు పేరు అన్వయ్ రెడ్డి. 

దిల్ రాజు రెండో భార్య తేజస్విని సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయ్యారు. ఆమె బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కిన హిట్ హిందీ ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా తేజస్విని దిల్ రాజు తో తన వివాహం ఎలా అయ్యిందో ఆ సీక్రెట్ రివీల్ చేసింది. దిల్ రాజు తనకు పెళ్లి ప్రపోజల్ పెట్టినపుడు ఆయనికి గతంలోనే పెళ్ళయ్యి, అమ్మాయి కూడా ఉండడంతో ఆమె వెనకడుగు వేసిందట. 

తర్వాత దిల్ రాజు ని అర్ధం చేసుకున్న తేజస్విని తమ పెళ్లి జరగాలంటే తన మావయ్య, పిన్ని ఒప్పుకోవాలని కండిషన్ పెట్టిందట దిల్ రాజు కి. తేజస్విని అమ్మమ్మ-తాతయ్య, మావయ్య ల దగ్గరే పెరగడంతో పెళ్లి బాధ్యతలు వాళ్లకు అప్పగించగా దిల్ రాజు తేజస్విని మావయ్యను చాలా త్వరగా ఒప్పించినా ఆమె పిన్ని మాత్రం దిల్ రాజు-తేజస్విని వివాహానికి అంత త్వరగా ఒప్పుకోలేదట. 

ఇక తనకు దేవుడు అన్ని ఎక్కువే ఇచ్చాడని, తనసలు ఓ సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని వివాహం చేసుకుంటాను అనుకోలేదని, దిల్ రాజు అంటే ఓ డైరెక్టర్ అనుకున్నాను, ఆయన గురించి గూగుల్ లో వెతికితే ఆయనొక ప్రొడ్యూసర్ అని తెలిసింది అంటూ తేజస్విని తమ పెళ్లి రహస్యాన్ని రివీల్ చేసింది. 

తనని అందరూ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యావా అని అడుగుతున్నారు, కానీ తాము తమ బాబుతో చాలా హ్యాపీ గా ఉన్నామని, తన కొడుకు తనకు బలం అంటూ తేజస్విని ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. 

Secret Behind Dil Raju Second Marriage

Dil Raju second marriage secret revealed
dil raju