ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha slams trolls over weight comment

దమ్ముంటే చెత్త కామెంట్లు చెయ్యండి-సమంత

Samantha slams trolls over weight comment

కొన్నాళ్లుగా సమంత ఫిట్ నెస్ పై సోషల్ మీడియాలో చాలా విమర్శలొస్తున్నాయి. మాయోసైటిస్ వ్యాధి వలన విపరీతమైన వర్కౌట్లు చేస్తున్న సమంత బాగా చిక్కిపోయి కనిపిస్తుంది. ఆమె ఎంత గ్లామర్ గా మారి ఫోటో షూట్ పోస్ట్ చేసినా అందులోని సమంత గ్లామర్ విషయం మాట్లాడుకోవాలి కానీ.. ఆమె సన్నబడిన విషయాన్నే అందరూ హైలెట్ చేస్తున్నారు. 

తాజాగా GQ అవార్డ్స్ కోసం సమంత స్టైలిష్ గా గ్లామర్ గా తయారై ఫోటోలకు ఫోజులిచ్చింది. సమంత టూ గ్లామర్ షో గురించి అందరూ స్పెషల్ గా చర్చలు పెట్టారు. సమంత ఎందుకింతగా గ్లామర్ షో చేస్తుంది.. అవసరమా అంటూ మాట్లాడుకోవడం ఒక ఎత్తు.. ఆమె సన్నగా మారిపోయి బక్క పల్చగా మారింది అని మాట్లాడడం మరో ఎత్తు. 

సమంత ఎందుకింతగా సన్నబడింది, ఆమె బరువు తగ్గి అందవికారంగా తయారైంది, హెల్త్ మళ్ళీ అప్ సెట్ అయ్యిందా అంటూ చేసిన కామెంట్స్ పై సమంత ఘాటుగా రియాక్ట్ అయ్యింది. నాపై చెత్త కామెంట్స్ చేసే ముందు ఒక డీల్ చేసుకుందాం.. సన్నబడ్డావు, అనారోగ్యం పడ్డావా లాంటి చెత్త కామెంట్స్ నాపై చేసే ముందు, మీరు కనీసం మూడు పుల్-అప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే, దయచేసి నా గురించి అలాంటి చెత్త కామెంట్స్ చెయ్యకండి. 

కాస్త కోపంగానే సమంత జిమ్ లో పుల్-అప్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. 

Samantha slammed a troll for commenting on her weight loss

samantha