Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Interesting: Manchu Manoj special wishes for Kannappa

ఇంట్రెస్టింగ్: కన్నప్ప కు మంచు మనోజ్ విషెస్

మంచు విష్ణు కి ఆయన తమ్ముడు మంచు మనోజ్ కి మద్యన ఆస్తి గొడవలు ఎంతగా రచ్చ అయ్యాయో అందరికి తెలుసు. మంచు మనోజ్ పలుమార్లు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను దొంగప్పా, శివయ్య అని పిలిస్తే శివుడు రాడు అంటూ మనోజ్ వెటకారంగా అన్న విష్ణు ప్రాజెక్ట్ కన్నప్ప పై కామెంట్స్ కూడా చేసాడు. 

రేపు కన్నప్ప విడుదల కాబోతున్న సమయంలో మంచు మనోజ్ కన్నప్ప టీమ్ కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఎక్కడా కూడా అన్న విష్ణు పేరు ప్రస్తావించకుండా తండ్రి మోహన్ బాబు సహా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్న మంచు కుటుంబ సభ్యులందరికీ అతను విషెస్ చెప్పాడు. 

కన్నప్ప చిత్రానికి ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీం ఎన్నో ఏళ్లు తమ కష్టాన్ని, ప్రేమను పెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌లకు సంబంధించి అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా కోసం వీళ్లంతా చేసిన సాయం, చూపించిన ప్రేమ, నమ్మకం.. ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ కన్నప్ప టీమ్ ని విష్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Manoj Manchu expresses his excitement for his father Mohan Babu upcoming film Kannappa

Interesting: Manchu Manoj special wishes for Kannappa
manoj manchu