కుబేర కి కాంట్రవర్సీ స్టార్ట్

Controversy begins for KuberaaControversy begins for Kuberaa

సినిమా విడుదలైన ఐదు రోజుల తర్వాత శేఖర్ కమ్ముల కుబేర చిత్రం పై హిందువులు ఆగ్రహం వ్యక్తం చెయ్యడం మాత్రం కాస్త విచిత్రమే అయినా.. కుబేర గత శుక్రవారం విడుదలై 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి సెలెబ్రేషన్స్ చేసుకునే సమయంలో కుబేర చిత్రం పై హిందువులు ఆందోళ చెయ్యడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. 

కుబేర ఇదెక్కడి దిక్కుమాలిన మూవీ అంటూ.. కుబేర చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శేఖర్‍ కమ్మల పై  హిందువులు విరుచుకుపడుతున్నారు. గత రెండు రోజులుగా అసలు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు హిందువులు దోపిడి ధారులు మరకలు గొర్రెలు మాత్రం మంచివారని చెప్పాలని అనుకున్నావా శేఖర్‍ కమ్ములా ?  

తిరుమల తిరుపతిలో తరిగొండ వెంగమాంబ అన్న సత్రం లో రోజుకి లక్షమంది భోజనం చేసేలా ప్రణాళిక ఉంది, అని నీకు తెలుసా…?మీరేమో తిరుపతిలో తిండి దొరకదు అన్నట్టు చూపించారు... విడ్డూరం కాకపోతే మజీద్ లో అన్నదానం చేస్తారట, హిందూ బిచ్చగాళ్లట వెళ్లి కడుపునిండా తింటారట... హిందూ ధనికులు దుర్మార్గాలు చేస్తారట, వారు ప్రజలను మోసం చేసి దగా చేసి వచ్చిన 

సొమ్ములోంచి వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేయిస్తారట. 

ఇది శేఖర్ కమ్ముల రాసిన కథనా ??? లేక హిందూ మత వ్యతిరేకులు వ్రాసిన స్క్రిప్టా?? ఇదేం దిక్కుమాలిన సినిమా ??? సినిమాలలో హిందూ వ్యతిరేకత మరీ పెట్రేగి పోతోంది రోజురోజుకు .. అంటూ కుబేర సినిమాపై హిందూ సంఘాలు గరం గరంగా ఉండడమే కాదు.. ఈ మెసేజ్ ని హిందువులు అంతా వాట్స్ ఆప్ గ్రూప్స్ లో ఫార్వార్డ్ చెయ్యడం గమనార్హం.  

Controversy Hits Shekhar Kammula Kuberaa

kuberaa