Advertisement

కాస్త ఎర్లీ గా థగ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్

కమల్ హాసన్-మణిరత్నం కలయికలో ఎన్నో ఏళ్ళ తర్వాత తెరకెక్కిన చిత్రం థగ్ లైఫ్. భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా మూవీ గా థగ్ లైఫ్ జూన్ 5 న విడుదలయ్యింది. థగ్ లైఫ్ ప్రమోషన్స్ పై ఉన్న హై, మణిరత్నం-కమల్ కాంబో పై ఉన్న క్రేజ్, కమల్-శింబు కలయిక ఇవ్వన్నీ థగ్ లైఫ్ పై అంచనాలు క్రియేట్ చేసాయి.

కానీ థగ్ లైఫ్ ఆడియన్స్ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. థియేటర్స్ లో విడుదలైన థగ్ లైఫ్ డిజాస్టర్ కోవలోకి వెళ్ళింది. దర్శకుడు మణిరత్నం కూడా థగ్ లైఫ్ డిజాస్టర్ పై అభిమానులకు, ఆడియన్స్ కు క్షమాపణ చెప్పారు. ప్రేక్షకుల అంచనాలు తాము రీచ్ అవ్వలేకపోయాము, వాళ్ళు ఒకటి అనుకుని వచ్చారు, కానీ థగ్ లైఫ్ మరోలా ఉండడం వాళ్లకు నచ్చలేదు అన్నారు.

అయితే థియేటర్స్ లో డిజాస్టర్ అయిన థగ్ లైఫ్ ఓటీటీ పై చాలారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. థగ్ లైఫ్ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ ఫిక్స్ థగ్ లైఫ్ ని చాలా త్వరగా స్ట్రీమింగ్ చేస్తుంది అనే టాక్ నడిచింది. కానీ తాజాగా థగ్ లైఫ్ జులై ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే థగ్ లైఫ్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నమాట. 

Thug Life To Stream On Netflix From July

Thug Life Advances OTT Streaming
thug life