శ్రీలీల కు బిగ్ షాక్ తగలనుందా

Sizzling beauty out of LeninSizzling beauty out of Lenin

టాలీవుడ్ లో ప్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటున్న క్యూట్ హీరోయిన్ శ్రీలీల. నిరాశ పరిచే సినిమాలతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుని మళ్ళీ బిజీ అయిన శ్రీలీల ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన రవితేజ మాస్ జాతర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అఖిల్ లెనిన్ చిత్రాల్లో నటిస్తుంది. మరోపక్క తమిళ, హిందీ చిత్రాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంది. 

అయితే శ్రీలీల ఫోకస్ అంతా హిందీ, తమిళం పైనే ఉండి, తెలుగు సినిమాలను నెగ్లెట్ చేస్తుంది అనే టాక్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో ఆమె ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ లో మాస్ జాతర షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా..  ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ కేటాయించిన శ్రీలీల లెనిన్ మేకర్స్ ని ఇబ్బంది పెడుతుంది అనే మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

పవన్ సినిమా కాబట్టి దానికి పర్ఫెక్ట్ గానే డేట్స్ ఇచ్చిన శ్రీలీల లెనిన్ విషయంలో అంత సీరియస్ గా లేదనే మాట వినబడుతుంది. అందుకే లెనిన్ నుంచి శ్రీలీల ను తప్పించే ఆలోచనలో లెనిన్ మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ని కూడా వెతుకుతున్నారంటున్నారు. మరి ఇదే నిజమైతే శ్రీలీల కు బిగ్ షాక్ తగిలినట్లే. 

Lenin- Akhil gets a beautiful shock

lenin