వెండితెరకు కానరాని తెలుగందం

Deepthi Sunaina latest photo shoot

చాలామంది అమ్మాయిలకు సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోవాలని, వెండితెరపై సెటిల్ అవ్వాలనే కల ఉంటుంది. అందుకే చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేలా వెబ్ సీరీస్ లు, ఇంకా బుల్లితెర షోస్ తో పాపులర్ అవుతున్నారు. అలాంటి వాళ్లలో వైష్ణవి చైతన్య కి హీరోయిన్ గా బేబీ చిత్రంలో ఛాన్స్ దొరికింది. అంతకుముందే హీరోలకు చెల్లెలి పాత్రల్లో ఆమె కనిపించింది. 

యూట్యూబ్ లో, వెబ్ సీరీస్ ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ గర్ల్ ఫ్రెండ్ గా పాపులర్ ఆయిన దీప్తి సునయన బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. ఆ తర్వాత ఆమె వెండితెరపైకి వస్తుంది అనుకున్నారు. కానీ దీప్తి సునయన సోషల్ మీడియాలోనే అందాలు అరబోసే పని పెట్టుకుంది. షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత అమ్మడు గ్లామర్ హీట్ పెంచేసింది. 

తాజాగా ఆమె గ్రీన్ శారీ లో క్యూట్ గా కనిపించింది. జడ వేసుకుని పదహారణాల తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది. చక్కటి లుక్ లో బ్యూటిఫుల్ గా ఉన్న దీప్తి సునయన ని చూసి అబ్బా ఇంతదాన్ని వెండితెర మిస్ అవుతుంది, వెండితెరపైకి కానరాని తెలుగందం అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Deepthi Sunaina new stills

deepthi sunaina