దృశ్యం 3 కి మాస్టర్ ప్లాన్

Master plan for Drishyam 3Master plan for Drishyam 3

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సిరీస్ తెలుగు, హిందీ రెండు లాంగ్వేజెస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మలయాళంలో అంటే మాతృక లో మోహన్ లాల్ దృశ్యంలో నటించగా, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ లు నటించారు. 

దృశ్యం సీరీస్ లు అద్భుతమైనా స్క్రీన్ ప్లే, అంతే ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ ట్విస్ట్ లతో మూడు లాంగ్వేజ్ ల ఆడియన్స్ కి బాగా నచ్చేసాయి. ఇప్పుడు మోహన్ లాల్-జీతూ జోసెఫ్‌ కాంబోలో దృశ్యం 3 అనౌన్స్ చెయ్యడంతో అందరూ వెంకీ, అజయ్ దేవగన్ ల వైపు  చూసారు. ఈలోపే దృశ్యం సీరీస్ లో భాగంగా తెరకెక్కనున్న దృశ్యం 3 ని మూడు లాంగ్వేజెస్ లో ఒకేసారి తెరకెక్కించి, ఒకేసారి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే న్యూస్ ఎగ్జైట్ చేస్తుంది. 

మలయాళంలో దృశ్యం 3కి నేను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3 వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. ఇతర లాంగ్వేజ్ ల హీరోల డేట్స్‌ కారణంగా ఈ సినిమాను ఒకే సమయంలో చిత్రీకరించలేకపోవచ్చు. ఎప్పుడు సినిమా షూట్ పూర్తయినా అన్ని భాషల్లో ఒకేసారి దృశ్యం 3ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం అంటూ జీతూ జోసెఫ్ చెప్పారు. 

మరి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఒక భాషలో విడుదలై మరో భాషలో విడుదలవుతుందో లేదంటే ఓటీటీ లోకి వస్తుంది అనగానే మళయాళమైనా, తమిళ్ అయినా, తెలుగు అయినా ఇలా ఏ భాషనైనా ఓటీటీ ఆడియన్స్ వదలడం లేదు. అందుకే దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఇలాంటి ప్లాన్ చేసి ఉంటారు. ఒకేసారి మోహన్ లాల్, వెంకీ, అజయ్ దేవగన్ ల దృశ్యం 3 వేరు వేరు లాంగ్వేజెస్ లో ఒకే కథతో విడుదలైతే ఆ ట్రీటే వేరు. 

Exciting update on Drishyam 3

drishyam 3