హీరో బర్త్ డే - నిహారిక స్పెషల్ పోస్ట్

Hero Birthday-Niharika Special PostHero Birthday-Niharika Special Post

మెగా డాటర్ నిహారిక నటనకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తుంది. రీసెంట్ గానే నిహారిక కమిటీ కుర్రాళ్లతో హిట్ కొట్టడమే కాదు తాజాగా కమిటీ కుర్రాళ్లకు గద్దర్ ఫిలిం అవార్డు కూడా అందుకుంది. ఇక చైతన్య జొన్నలగడ్డ తో విడాకులయ్యాక నిహారిక రెండో పెళ్లి విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. 

ఇపుడు నిహారిక ఓ యువ హీరో బర్త్ డే కి చేసిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అంకిత్ కొయ్య. ఆయ్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య బర్త్ డే సందర్భంగా నిహారిక స్పెషల్ పోస్ట్ పెట్టింది. 

నాకు ఐదేళ్లుగా అంకిత్ తెలుసు. మేము ఎప్పుడు కలిసినా సినిమాల గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటాం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. మా బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్‌గా నిలిచారు.. నువ్వు ఇలానే స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగాలి.. హ్యాపీ బర్త్ డే అంకిత్ అంటూ నిహారిక అంకిత్ కి ఇలా స్పెషల్ పోస్ట్ తో బర్త్ డే విషెస్ తెలియజేసింది.  

Niharika Konidela About Ankith Koyya

niharika