లోకేష్ కి క్రెడిట్ ఇచ్చిన PM మోడీ

PM Modi gave credit to LokeshPM Modi gave credit to Lokesh

జూన్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన పీఎం నరెంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రంలో పీఎం మోడీ యోగాసనాలు వెయ్యడమే కాదు, యోగ ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగమవ్వాలి అంటూ ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు మోడీ.  

అంతేకాదు విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అవడం వెనుక నారా లోకేష్ కృషి ఉంది అంటూ ప్రధాని మోడీ లోకేష్ ని ప్రత్యేకంగా కొనియాడారు. పదేళ్ల కింద‌ట అంత‌ర్జాతీయ‌ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసుకున్నారు. ప్ర‌స్తుతం 175 దేశాల్లో యోగా సాధ‌న చేయ‌డంతోపాటు.. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో భాగ‌స్వామ్యం అవుతున్నార‌ని తెలిపారు.

నెలన్నర కాలంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, సమాజంలోని అనేక వర్గాలను ఏకం చేయడం ద్వారా యోగాంధ్ర కు ప్రత్యేక గుర్తింపు దక్కింది అని మోడీ అన్నారు. అంతేకాకుండా నిన్న  శుక్ర‌వారం నిర్వ‌హించిన 108 నిమిషాల్లో 108 సూర్య‌న‌మ‌స్కారాలను స‌క్సెస్ చేయ‌డంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందని మోడీ లోకేష్ ని పొగిడేశారు. 

PM Modi appreciates Lokesh for making Yogandhra project

lokesh