Loading...

ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

MLA Padi Kaushik Reddy arrested

ఈ రోజు శనివారం ఉదయం బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే, సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కలకలం సృష్టించింది. ఎన్నికల్లో గెలిచేందుకు ఫ్యామిలీతో సహా ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ లో హైలెట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే కాదు, పర్సనల్ గాను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. 

కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదు చేసి వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

అరెస్ట్ సమయంలో కౌశిక్ రెడ్డి.. అక్రమంగా గ్రానైట్ క్వారీని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనే అంటూ ఆరోపించారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని బీఆర్‌ఎస్ టీమ్ కలిసి బెయిల్ ఏర్పాట్లు చేస్తుంది. 

BRS MLA Padi Kaushik Reddy arrested in threat case

padi kaushik reddy