ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The difficulties of cinema for television

బుల్లితెరకు సినిమా కష్టాలు

The difficulties of cinema for televisionThe difficulties of cinema for television

థియేటర్స్ లోనే కాదు కొన్నాళ్లుగా ఓటీటీలలోను సరైన సినిమాలు, వెబ్ సిరీస్ లు లేక ప్రేక్షకులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కి వచ్చిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాల తర్వాత విడుదలైన బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ ఏవి లేవు. మధ్యలో వచ్చిన తండేల్, మ్యాడ్ స్క్వేర్, హిట్ 3, సింగిల్ ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టే మీడియం రేంజ్ సినిమాలే తప్ప గత ఆరు నెలలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, థియేటర్స్ అన్ని ఖాళీగా కనిపించడమే కాదు, ఓటీటీలలో ఏదో తమిళ, మలయాళ మూవీస్ కాస్త గట్టిగా నిలబడ్డాయి. లేకపోతే ప్రేక్షకులు మరింత డిజప్పాయింట్ అయ్యేవారే.  

థియేటర్స్, ఓటీటీ మాత్రమేనా ఆఖరికి బుల్లితెరపై కూడా సరైన సినిమాలు లేక వేసిందే వేసి వేసి చంపుతున్నారు ఛానల్స్ వారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సీరియల్స్ హడావిడి సరిపోతుంది. శని, ఆదివారాల్లో టీవీ పెడితే చాలు వేసిన సినిమాలే వేసి బోర్ కొట్టిస్తున్నారు. స్టార్ మా లో ఉదయం వేసిన సినిమాని, స్టార్ మా మూవీస్ లో సాయంత్రం వేస్తున్నారు. 

ఇక జెమినిలో ఉదయం వేసిన సినిమాని, జెమినీ మూవీస్ లో సాయంత్రం వేస్తున్నారు అంటే ఒక్క సినిమాని తిప్పి తిప్పి ఒకే రోజు బుల్లితెరపై ప్రదర్శిస్తుంటే బుల్లితెర ఆడియన్స్ కు చిరాకు రాక ఇంకేమొస్తుంది. స్టార్ మా, స్టార్ మా మూవీస్, జీ తెలుగు, జీ సినిమాలు ఇలా  కొత్త కొత్తవి కాకపోయినా.. కనీసం వేసిన సినిమాలు తిప్పి తిప్పి వెయ్యకుండా ఉంటె చాలని చాలామంది బుల్లితెర ఆడియన్స్ గోల చేస్తున్నారు. 

Television movies

movies