జగన్ కు పవన్ మాస్ వార్నింగ్
Pawan mass warning to Jaganవైసీపీ పార్టీ ఓడిపోయాక జగన్ సినిమా డైలాగ్స్ బట్టి పడుతున్నారా అనేలా జగన్ మీడియా ముందు సినిమా డైలాగ్స్ చెప్పడం గమనార్హం. ఎప్పుడు ఒకటే మాట పోలీసులకు నేను అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాను అంటూ చెప్పే జగన్.. ఇప్పుడు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును తన స్టయిల్ ల్లో చెప్పడం చూసి అసలు జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, నేరస్తులను ప్రోత్సహించడమే కాదు నరుకుతా, చంపుతా అంటూ తన కార్యకర్తలను ఆయన రెచ్చగట్టడమేమిటి అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
నేరస్తులను, రౌడీ షీటర్స్ ను జగన్ వెనకేసుకురావడమే కాదు, బెట్టింగ్ లకు పాల్పడి ప్రాణాలు తీసుకుని వారికి విగ్రహాలు పెట్టించి, వాటిని ఆవిష్కరించడమేమిటో అంటూ జగన్ తీరుకు ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఇక ఫ్లోలో జగన్ చెప్పిన రప్పా రప్పా డైలాగు పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అవ్వగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
నోటికొచ్చినట్లుగా, ఇష్టం వచ్ఛినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, అలాంటి వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాల్సి ఉందన్న పవన్, అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయని.. వాటిని ఆచరణలో పెడతాము అంటే అది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పవన్ గట్టిగా రియాక్ట్ అయ్యారు.
అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్న పవన్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ప్లకార్లులు పట్టుకోవడం గానీ, ఆ విధంగా నినాదాలు చేయడం గానీ చేస్తే సహించేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ మాత్రం వైరల్ అయ్యింది.
Deputy CM Pawan Kalyan Mass Reaction On YS Jagan







































