కన్నప్ప - ప్రభాస్ వస్తున్నారా

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ అనే కన్నా క్రేజీ గా నడుస్తున్నాయి అని చెప్పాలి. కొచ్చి, ముంబై, రాజస్థాన్ ఇలా కన్నప్ప ఈవెంట్స్ ను మంచు విష్ణు టీమ్ ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటివరకు కన్నప్ప టీమ్ లోని క్రేజీ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మంచు విష్ణు, ఇంకా ఇతర ఆర్టిస్ట్ లు కన్నప్ప ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు.
కానీ కన్నప్ప లో మరో కీ రోల్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేనండి హైదరాబాద్ లో జరగనున్న ఈవెంట్ లో కనిపిస్తారా అనే సందేహంలో చాలామంది కనిపిస్తున్నారు. కన్నప్ప లో ప్రభాస్ రుద్ర కేరెక్టర్ చెయ్యడమే నమ్మశక్యం కాని విషయం, ఇప్పుడు కన్నప్ప ప్రమోషన్స్ కోసం ప్రభాస్ వస్తారా అనే విషయంలో మాత్రం చాలా క్యూరియాసిటీ నడుస్తుంది.
అయితే మోహన్ బాబు స్వయానా ప్రభాస్ కి ఫోన్ చేసి ఈవెంట్ కి రావాల్సిందిగా కోరారని తెలుస్తోంది. మరి ప్రభాస్ శనివారం హైదరాబాద్ లో కన్నప్ప ప్రీ రిలీజ్ వేడుకకి హజారావుతారా, ఆయన సినిమాల ఈవెంట్స్ కే ఆయన పెద్దగా రారు, అందుకే అందరిలో అంత అనుమానం. చూద్దాం.. ప్రభాస్ కన్నప్పను సపోర్ట్ చేస్తారా, లేదా అనే విషయం..
Kannappa pre-release event to be held this Saturday in Hyderabad
Will Prabhas promote Kannappa?








































