Loading...

మెగాస్టార్ కొడుక్కి ఎందుకీ వైరాగ్యం

Abhishek Bachchan shares cryptic post

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ వైరాగ్యంగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ నటుడిగా పాపులర్ యాక్టర్ కాకపోయినా.. ఏదో ఒక సినిమా, లేదంటే వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ  ఉంటారు. అటు అమితాబ్ కొడుకుగా, నటి ఐశ్వర్య రాయ్ భర్తగా అభిషేక్ కి గుర్తింపు ఉంది. 

కొన్నాళ్లుగా భార్య ఐష్ తో అభిషేక్ విడిపోతున్నారనే రూమర్స్ కు తరచూ రియాక్ట్ అయ్యే అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండరు. అలాంటి అభిషేక్ సోషల్ మీడియాలో గత రాత్రి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారికోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు కేవలం నాకోసం మాత్రమే సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవాలంటే నాకు సమయం కావాలి.. 

అంటూనే కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. అందరికీ దూరంగా ఉండాలి అని అర్ధం వచ్చేలా చేసిన పోస్ట్ చూసి ఏంటి అభిషేక్ ఎందుకీ వైరాగ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలనుకుంటున్నావ్ అంటూ నెటిజెన్స్ అభిషేక్ పోస్ట్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. 

Abhishek Bachchan shares cryptic post about wanting to disconnect

abhishek bachchan