Loading...

మొదటి చూపులోనే ప్రభాస్ నచ్చేసాడు-మాళవిక

Malavika Mohanan On Prabhas

మలయాళీ భామ మాళవిక మోహనన్ కి మలయాళంలో కన్నా ఎక్కువగా తమిళనాట స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ మాళవిక మోహనన్ కి ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ దక్కలేదు. ఇప్పుడు ఈ అందాల రాశి, గ్లామర్ క్వీన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తుంది. రాజా సాబ్ లో మాళవిక మోహనన్ వన్ ఆఫ్ ద హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. 

తాజాగా విడుదలైన రాజా సాబ్ టీజర్ లో మాళవిక మోహనన్ గ్లామర్ షో యూత్ కి కనెక్ట్ అయ్యింది. ప్రభాస్ తో రొమాంటిక్ యాంగిల్ లో మాళవిక రచ్చ మాములుగా లేదు, ఇక రాజా సాబ్ ముచ్చట్లు, ప్రభాస్ తో వర్కింగ్ స్టయిల్ గురించి, ఆయన పంపిన ఫుడ్ గురించిన విషయాలను పంచుకున్న మాళవిక తాజాగా ఫ్యాన్స్ చిట్ చాట్ లో ప్రభాస్ ని మొదటిసారి చూసినప్పుడు ఎలా ఫీలైందో చెప్పుకొచ్చింది. 

రాజా సాబ్ ఆఫర్ వచ్చాక ప్రభాస్ తో కలిసి సెట్ లోకి అడుగుపెట్టే సందర్భంలో అంటే నేను ప్రభాస్ ని మొదటిసారి కలవాల్సి వచ్చినప్పుడు.. వేరే షూటింగ్ లో అలిసిపోయి అలానే హైదరాబాద్ జర్నీ చేసి రాజా సాబ్ సెట్ లోకి అడుగుపెట్టినప్పుడు ప్రభాస్ ని ఫస్ట్ చూడగానే నా అలసట ఎగిరిపోయి చాలా ఎనర్జీగా, యాక్టీవ్ గా అయిపోయాను. 

మొదటిసారి ప్రభాస్ ని చూడగానే నచ్చేసాడు, అలా చూస్తుండిపోవాలనిపించింది, ప్రభాస్ చాలా అందగాడు అంటూ మాళవిక ఫ్యాన్స్ చిట్ చాట్ లో ప్రభాస్ ని మొదటిసారి చూసినప్పుడు ఎలా ఫీలైందో చెప్పుకొచ్చింది. 

Malavika Mohanan on working with Prabhas

prabhas