Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pregnant Kiara: Yash Shocking Decision on Toxic

కియారా ప్రెగ్నెంట్-యష్ షాకింగ్ డెసిషన్

Pregnant Kiara: Yash Shocking Decision on Toxic

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికి తెలుసు. కియారా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన వెంటనే ఆమె నటిస్తున్న చిత్రాలపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే కియారా వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చెయ్యడం, ఆ తర్వాత ఆమె కన్నడ హీరో యష్ తో చేస్తున్న టాక్సిక్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీ అయ్యింది. 

అయితే కియారా అద్వానీ బేబీ బంప్ తోనే యష్ టాక్సిక్ షూటింగ్ కి హాజరవుతుంది. ప్రస్తుతం బెంగుళూరులో టాక్సిక్ చిత్రీకరణను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చేపట్టారు. అయితే ప్రెగ్నెన్సీ తో ఉన్న కియారా అద్వానీ షూటింగ్ కోసం ముంబై నుంచి బెంగుళూరు కి వచ్చి వెళుతుందట. ముంబై - బెంగుళూరు ఫ్లైట్ జర్నీ వలన కియారా అద్వానీ ఇబ్బంది పడకూడదు అని యష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. 

బెంగుళూరులో చేస్తున్న షూటింగ్ ను కియారా అద్వానీ సేఫ్టీ కోసం ముంబై కి షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు షూటింగ్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్ళాక భారీగా ఖర్చు కాకుండా యష్ జాగ్రత్తలు తీసుకుంటుంన్నారట. ప్రెగ్నెన్సీ తో ఉన్న కియారకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఆమె సన్నివేశాలను తెరకెక్కించాలని దర్శకురాలు కూడా చూస్తున్నారట. 

డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.   

Yash Changes Toxic Filming Location

yash