Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Everything is Vijay Deverakonda - Rashmika

విజయ్ దేవరకొండలో అన్ని ఇష్టమే-రష్మిక

Everything is Vijay Deverakonda - Rashmika

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - టాప్ హీరోయిన్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పటివి కాదు, వారిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నప్పటినుంచే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీక్రెట్ గా వెకేషన్ కి వెళతారు, లంచ్ డేట్, ఫ్యామిలీ డేట్ అంటూ హడావిడి చేస్తారు, హైదరాబాద్ వస్తే రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుంది. 

అయితే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటే ఒప్పుకోరు, జస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఈమధ్యన రష్మిక-విజయ్ దేవరకొండ పై పలు రకాల రూమర్స్ చక్కర్లు కొట్టినా వీరిద్దరిలో ఎవ్వరూ ఓపెన్ అవ్వరు. తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ రష్మిక మందన్నా, అలాగే నాగ్, ధనుష్, శేఖర్ కమ్ములతో చిట్ చాట్ చేసింది. 

అందులో రష్మిక ను ప్రశ్నిస్తూ.. నాగార్జున గారిలో మీకిష్టమైన అంశం ఏమిటి అనగానే ఛార్మ్ అంది రష్మిక, అల్లు అర్జున్ అంటే స్వాగ్ అంది. ధనుష్ లో కష్టపడే తత్త్వం నచ్చుతుంది అన్న రశ్మికను మరి విజయ్ దేవరకొండ లో ఏం నచ్చుతాయంటే అన్ని నచ్చుతాయని రష్మిక సిగ్గుపడుతూ ఇచ్చిన ఆన్సర్ చూసి అందరూ రష్మిక-విజయ్ దేవరకొండ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని కామెంట్లు పెడుతున్నారు. 

yes..! everything is Vijay Devarakonda : Rashmika Mandanna

rashmika